Thursday, May 16, 2024

TS | సరస్వతి విద్యామందిర్ లో వరలక్మీ వ్రతం..

భీంగల్ టౌన్, (ప్రభన్యూస్ ) : నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని సరస్వతి విద్యామందిర్ లో ఇవ్వాల (శుక్రవారం) శ్రావణమాసం పురస్కరించుకొని వరలక్మీ వ్రతం ఆచరించారు. పురోహితులు శ్రీ యోగేష్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన సుహాసినిలు పాల్గొని భక్తి శ్రద్దలతో వరలక్మీ వ్రతం ఆచరించారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరించడం వలన విశేష ఫలితాలు ఉంటాయని అర్చకులు తెలిపారు.

- Advertisement -

సర్వ మంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాలు అభిష్టాలు నెరవేరుతాయని, నిత్య సుమంగళి గా వర్దిల్లు తామని స్త్రీలు వ్రతం చేస్తారని అన్నారు. వ్రతం చేయడం ద్వారా అమ్మవారి కరుణ కటాక్షం దొరుకుతుందని సుహాసినిలు నమ్ముతారు. పాఠశాల లో నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతం లో పాఠశాల కార్యదర్శి నర్సయ్య, ఏవో నర్సారెడ్డి, పాఠశాల మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు, మాతృ మూర్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement