Saturday, April 27, 2024

NZB: వారం రోజుల్లో పూర్తి మార్పు రావాలి… లేదంటే చర్యలుంటాయ్ … ధన్ పాల్

నిజామాబాద్, మార్చి 29 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో వాటర్ ఫిల్టర్ బెడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, వారం రోజుల్లో పూర్తిగా మార్పు రావాలని, లేకుంటే చర్యలు తప్పవని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఇందూర్ జిల్లా నగరపాలక సంస్థ మంచినీటి కోసం నిర్మించిన అలి సాగర్, ఖిల్లా వాటర్ ఫిల్టర్ బెడ్ లకు శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ… నగరంలో పలు డివిజన్ లో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు మంచినీటి ఫిల్టరింగ్ ఎలా జరుగుతుందని పరిశీలించారు. అలిసాగర్ ప్రాజె క్టు పూర్తి సామర్ధ్యం 0.30 టీఎ మ్ సి ఉండగా ఇప్పుడు ఉన్న నీటి సామర్ధ్యం రెండు నెలలకు సరిపోతుందని తెలిపారు.

కానీ సగం యంత్రాలు పనిచేయడం లేదని అధికారులు నిర్లక్షంగా వ్యవహారిస్తున్నారని వారిపై మండిపడ్డారు. ఖిల్లా వాటర్ ఫిల్టర్ కూడా చాలా దారుణమైన దుస్థితి ఉందని, సరైన మెయింటెనెన్స్ లేక ఫిల్టర్ అయినా నీటిలో నాచు, వేస్ట్ పదార్ధాలు చెత్త పేరుకుపోయి ఉన్నాయని, ప్రజల జీవితాలతో ఇరిగేషన్ అధికారులు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శన‌మ‌ని మండిపడ్డారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో దీని పై నివేదిక ఇవ్వాలని, యంత్రాలన్నీ పని చేసే విధంగా చర్యలు తీసుకొని, స్వచ్ఛమైన త్రాగు నీటిని నగర ప్రజలకు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్ ఎం సి కార్పొరేటర్స్, మండల అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement