Sunday, April 28, 2024

NZB: అన్ని కులాలకు అండగా ఉంటా… రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్ రూరల్, డిసెంబర్29(ప్రభ న్యూస్): కాంగ్రెస్ పార్టీ లో కుల మత బెదలు లేకుండా అన్ని కుల మతాల వారికి అండగా నిలిచి పని చేస్తామని రూరల్ ఎమ్మేల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. డిచ్ పల్లి లో ని కే ఎన్ ఆర్ గార్డెన్ లో నిజామాబాద్ రూరల్ నియోజక వర్గ క్రిస్మ‌స్‌ సెలబ్రేషన్‌కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే కేక్ కట్ చేశారు.అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నన్ను గెలిపించిన క్రిస్మస్ సోదరులకు రుణపడి ఉంటానని ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అని కుల మతాలు భేదాలు లేకుండా పని చేస్తుందన్నారు. అనంతరం క్రైస్తవ నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పలు గ్రామాల్లో సమాదుల స్థలం చర్చ్ లు నిర్మించుకునేందుకు గ్రామ పంచాయితీ నుండి అనుమతులు చర్చిలలో త్రాగునీటి సమస్య లపై క్రైస్తవులు ఎమ్మేల్యే దృష్టికి తేగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్రమంలో ఆర్డీవో రాజేందర్, ఎమ్మార్వో శ్రీనివాస్ తో పాటు ఏడు మండలాల రెవెన్యూ అధికారులు, నిజామాబాద్ రూరల్ క్రైస్తవ సంఘం అద్యక్షులు దొబ్బల బిక్షపతి, సెక్రెటరీ ప్రభాకర్, సిరికొండ మండల అధ్యక్షులు డేవిడ్ నాయక్, మోపాల మండల అద్యక్షులు యేసు రత్నం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement