Thursday, May 9, 2024

రైతులకు ఏకకాలంలో రుణ మాఫీ చేయాలి .. బిజెపి

నిజామాబాద్ సిటీ జూలై (ప్రభ న్యూస్)18:ఆరుగాలంపాటి శ్రమించి.. ఎన్నో వ్యయా ప్రయాసాల కూర్చి పంటలను పండిస్తున్న రైతన్నను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్య నారాయణ ,వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్య క్షుడు నూతల శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ ముందు దీక్ష కార్యక్రమం చేపట్టారూ. ఈ దీక్ష కార్యక్రమానికి ధన్ పాల్ సూర్యనారాయణ , వడ్డీ మోహన్ రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయి రుణమాఫీ చేస్తానని చెప్పి నేటి వరకు కూడా మాఫీ చేయలేదన్నారు.

- Advertisement -

వెంటనే లక్ష రూపాయలు అసలు తో పాటు వడ్డీని కూడా చెల్లించాలని, అ రాష్ట్రంలో పసల్ బీమా యోజ న అమలు చేసి జిల్లా యంత్రాం గాన్ని ఆదుకునే విధంగా చూడా లని డిమాండ్ చేశారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే కేసీఆర్ 31 లక్షల మంది రైతుల నోట్లో మట్టి కొట్టాడన్న మోసపు మాటలతో రైతన్నలను మభ్యపెడుతున్నారన్నారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ తరపున జిల్లా కలెక్టరేట్ ముందు దీక్షా కార్యక్రమం చేపట్టారు ఈ దీక్షలో భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిలు సరిన్ హరీష్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్, ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, నర్మ రాజన్న, కూరెళ్ల శ్రీధర్, డమన్కర్ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నాయకులు కిసాన్ మోర్చా నాయకులు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement