Monday, May 6, 2024

NZB: పెట్రోల్ బంకుల బంద్ పై ప్రజలు ఆందోళన చెందొద్దు…

నిజామాబాద్ సిటీ, జనవరి 2 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాలోని పెట్రోల్ బంకులు బంద్ పై ప్రజలు ఆందోళన చెందొద్దని పెట్రోల్ బంక్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వినోద్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్తచట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లారీ, ట్యాంకర్లు, ఇతర వెహికిల్ ల డ్రైవర్లు ఈనెల 1న ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు వినోద్ మాట్లాడుతూ… డ్రైవర్లు సమ్మెకు దిగిన నేపద్యంలో కొన్ని బంకుల్లో పెట్రోల్ సరఫరాకు కొంత మేరకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. అంతే కానీ మూడు రోజులు పెట్రోల్ బంకులు బంద్ అనే మాట అవాస్తవమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై కొత్తగా వచ్చిన చట్టంపై డ్రైవర్లకు అవగాహన లేక ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల నిర్వాహకులు సొంత వాహనాల ద్వారా పెట్రోల్ సరఫరా ఎప్పటిలాగే యధావిధిగా జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement