Monday, May 6, 2024

TS: గౌడసంఘం అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్, (ప్రభ న్యూస్) : గౌడ కులస్తుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి తనవంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం గౌడ సంఘం అధ్వర్యంలో గోదావరి తీరాన కొలువుదీరిన రేణుక ఎల్లమ్మకు మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి హాజరై ప్రత్యేకపూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల నామినేషన్ దాఖలు అనంతరం దర్శించుకున్న మొట్టమొదటి ఆలయం రేణుక ఎల్లమ్మ తల్లి అని, ఆమె ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు కుర్మ అశోక్ గౌడ్, నాయకులు జక్కుల సత్య నారాయణ, కుర్మ సత్యనారాయణ, లక్ష్మి రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement