Sunday, April 28, 2024

NZB: నామినేషన్ బోణి… మొద‌ట‌గా స్వతంత్ర అభ్యర్థి దాఖలు

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు. గురువారం మొదటి రోజు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకుడు రాపేల్లి సత్య నారాయణ మొట్టమొదటి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు ప‌త్రాలను సమర్పించారు.

గత ఏ ప్రభుత్వాలు కూడా రిటైర్డ్ ఎంప్లాయిస్ ల సమస్యలు పట్టించుకోలేదనీ… మా సమస్యలు మేమే పరిష్కరించుకునేలా ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచానని తెలిపారు. అసోసియేషన్ సభ్యులు, ఇతర కార్పొ రేషన్ ఉద్యోగులు సుమారు 15వేల మంది త‌మకు మద్దతుగా నిలిచారని తెలిపారు. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయిస్ సమస్యలు పరిష్కరించాలని గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పలుమార్లు త‌మ సమస్యలపై అశోక్ రావత్ గళమెత్తారు. త‌మకు పూర్తి మద్దతుగా అశోక్ రావత్ ఉన్నారని చెప్పారు. నామినేషన్లు ప్రారంభమైన సందర్బంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement