Saturday, April 27, 2024

కేసీఆర్ ప్ర‌భుత్వంపై కొండా ఫైర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం నిజామాబాద్ లోని ధర్నా చౌక్ లో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆరోపించారు. నిరుపేదల కళ అయినటువంటి డబుల్ బెడ్ రూంలపై బిజెపి నాయకులు సమర శంకారావం పూరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని విమర్శించారు. మార్చి 31లోపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మేమే పంపిణీ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బోధన్ నియోజకవర్గ సీనియర్ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ధన్ పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, జిల్లా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement