Saturday, May 4, 2024

NZB: నష్టపరిహారం చెల్లించి రైతులని ఆదుకోవాలి… దినేష్ కుల చారి

నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ 4 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని బీజేపీ రూరల్ ఇంచార్జి దినేష్ కుల చారి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, నిజామాబాద్ మండలాలలో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు తెగిపోయి రైతుల పంట పొలాలు కొట్టుకుపోయాయని వాపోయారు. ఇసుక తెప్పలు పెట్టి పంట నష్టం వాటిలిందని, ఎకరానికి 20 నుంచి 25000 ఖర్చు చేసి దుక్కి దున్ని, నారు పోసి పంటలు వేసుకున్న రైతులకు తీరని నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు.

భారీ వర్షాలతో కొన్ని గ్రామాల్లో ఇల్లు, రాకపోకలకు సంబంధించిన బ్రిడ్జిలు కొట్టుకుపోవడం జరిగిందని రోడ్లు బాగుచేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, అభివృద్ధి చేయలేక విఫలమ య్యారన్నారు. రూరల్ లో జక్రాన్ పల్లికి చెందిన యాదవ కుటుంబానికి చెందిన అమ్మాయిని లవ్ జిహాద్ తో తీసుకెళ్లడంతో తండ్రి ఆత్మహత్య చేసుకోవడం విషాధకరమని, పోలీసులు మాత్రం ఆత్మహత్య కాదని సహజ మరణమేనని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాంటివి జరగడానికి కారణం నాయకులే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, బీజే వైఎం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కిసాన్ మోర్చా రైతు అధ్యక్షులు కిషన్ నాయక్,రూరల్ మండల అధ్యక్షులు జగన్ రెడ్డి, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement