Saturday, April 27, 2024

Nzb: విద్యార్థులకు ఉత్తమ పురస్కారాలు అందజేత

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ప్రస్తుత ఏడాదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఏర్పాటు చేసిన అయేషా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు అవార్డులను అందించారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షురాలు ఆయేషా ఫాతిమా, మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెంకటేశ్వర దేశాయ్, పట్టణ అధ్యక్షులు రవీంద్ర యాదవ్ జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోధన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న 10వ తరగతి ఇంటర్మీడియట్, డిగ్రీ తదితర పరీక్షల్లో నైపుణ్యాన్ని సాధించిన వారికి ఆయేషా ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించి విద్యార్థులను అభినందించారు.

తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారి పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకొని తమ పిల్లలను చదివిస్తూ ఆర్థిక భారాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకు వెళుతున్నారు. ప్రతి ఒక్కరూ చదువులో రాణించే ప్రయత్నం చేయాలని ఆయేషా ఫాతిమా ఆశాభావం వ్యక్తం చేశారు. చదువుకు పేదరికం రాదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి పేదలకు విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విద్యా అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో డబ్బున్న వారే చదువుకునే అవకాశాలు ఉండేవని, ప్రస్తుతం చదవాలన్న దృఢ సంకల్పం ఉన్న వారికి ప్రభుత్వం చదువుకునే అవకాశం కల్పించిందన్నారు. చదువులో రాణిస్తే పేదరికం రూపుమాపవచ్చని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చితే వారు ఎంతో సంతోషంగా ఉంటారని, విద్యార్థులు తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చే విధంగా చదువులో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement