Monday, May 6, 2024

NZB: సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి

నిజామాబాద్ సిటీ, ఆగస్టు 28 (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, విద్యాశాఖ సమగ్ర శిక్ష ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత- వెంటనే కనీస వేతన స్కేలు అమలు చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు డిలీప్, ప్రధాన కార్యదర్శి కే.రాజు, ఉద్యోగులు కోరారు. విద్యాశాఖ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు అధిక సంఖ్యలో కలెక్టరేట్ వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ నిరసనను వ్యక్తం చేసి అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యాశాఖ-తెలంగాణ సమగ్ర శ్రీ ఒప్పంద పద్ధతిలో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో క్లస్టర్, రిసోర్స్, పర్సరిస్ భవిత కేంద్రంలో ఇన్ క్లుసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ మండల స్థాయి లో వివిధ హోదాల్లో 21,000 పైగా ఉద్యోగులు గత 15 ఏళ్లు గా పనిచేస్తున్నామని తెలిపారు.

విద్యాశాఖలో కీలకంగా ఉంటూ రాష్ట్రంలో విధ్యాభివృద్ధే తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. తాము రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికై ఉద్యోగ భద్రత అర్హత కలిగి ఉన్నామని పేర్కొన్నారు.
అన్నిరకాల అర్హతలున్నప్పటికీ తాము ఉద్యోగ భద్రతకు నోచుకోలేదని వాపోయారు. ఒడిశా, హర్యాణ, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో క్రమబద్ధీకరణ జరిగిందన్నారు. తమకు కనీస వేతన స్కేలు అమలు చేయడం లేదని, ఉద్యోగ భద్రత, ఆరోగ్య/ప్రమాద భీమా సౌకర్యాలు కూడా లేవనీ… తామంతా నిరుపేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారమన్నారు. తమ ఆర్థిక, సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

విద్యాశాఖ నియామకాల్లో 30శాతం వెయిటేజి కల్పించాలనీ, ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సహజ మరణానికి రూ.5లక్షలు చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని కోరారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించాలనీ, హెల్త్ కార్డ్ కల్పించాలని, భారత సర్వోన్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పు చెప్పిందనీ, 2018 ఆర్సి కమిటీ ప్రతి కాంటాక్ట్ ఉద్యోగ కనీస వేతన స్కేలు ఉద్యోగి హెూదాను తన నివేదికలో ప్రభుత్వ ఉద్యోగికి చెల్లించే మూలవేతనం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సిహెచ్ ప్రసాద్, గౌరవాధ్యక్షులు ఆఫ్రాప్ అలీ, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement