Sunday, April 28, 2024

NZB: నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. కలెక్టర్

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 17 : నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఈనెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజు నుండి నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కలెక్టర్, సీ.పీలు బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడుతుందని, ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుం దని, ఏప్రిల్ 26 న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలోని తన (కలెక్టర్) ఛాంబర్ లో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. సెలవు దినాలు మినహాయించి, మిగతా పని దినాలలో ఈ నెల 18 నుండి 25 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామి నేషన్లు స్వీకరిస్తామని వివరించారు.

నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి, లేదా ప్రతిపాదించిన వ్యక్తి స్వయంగా హాజరై నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఈనెల 25 వ తేదీ లోపు ఆర్.ఓ సమక్షంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎవరైనా అభ్యర్థులు ప్రభుత్వ క్వార్టర్లలో ఉన్నట్లయితే, నీటి బిల్లులు, కరెంటు బిల్లులు వంటివి బకాయిలు లేవని నో డ్యూ సర్టిఫికెట్ జతపర్చాలని సూచించారు. నామినేషన్ సమర్పించే ముందు అన్ని అంశాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని హితవు పలికారు. అభ్యర్థులకు సహాయపడేందుకు ఆర్.ఓ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం 1701573 మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటర్ల నమోదు కోసం దాఖలైన దరఖాస్తులను ఈ నెల 25 వరకు పరిశీలించి జాబితాలో ఆర్గులైన వారి పేర్లను చేర్చడం జరుగుతుందని, దీంతో పోలింగ్ నాటికి ఓటర్ల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు మొత్తం 22 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. తనిఖీలలో ఇప్పటివరకు రూ. 3304837 నగదుతో పాటు రూ. 2800000 విలువ చేసే ఆభరణాలు ఇతర వస్తువులను సీజ్ చేయడం జరిగిందన్నారు.


సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంతో పాటు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలు
200 మీటర్ల దూరం వరకే అనుమతి
జిల్లా వ్యాప్తంగా సుమారు 1900 మంది పాత నేరస్థులను బైండోవర్
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్
నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలకు సువిధ ద్వారా ముందస్తుగానే దరఖాస్తులు చేసుకుని అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. ఎన్నికల నియమావళిని అను సరిస్తూ, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం తో పాటు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, నలుగురి కంటే ఎక్కువ సంఖ్య లో ఒకే చోట గుమిగూడి ఉండకూడదని తెలిపారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిం చడం జరుగుతుందని, మిగతా అందరిని కలెక్టరేట్ మెయిన్ గేట్ నుండి 200 మీటర్ల దూరం వరకే అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలను పురస్క రించుకుని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారు 1900 మంది పాత నేరస్థులను బైండోవర్ చేశామని, భద్రతా కారణాలతో బ్యాంకులను మినహాయించి, మిగిలిన వారందరి వద్ద లైసెన్సులు కలిగి ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేయించామని వివరించారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. పాత్రికేయుల సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement