Monday, May 6, 2024

ప్రభుత్వ భూమి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి.. కలెక్టరేట్ ఎదుట ఆందోళన

నిజామాబాద్ సిటీ, మే 22 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో 979 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న కబ్జాదారులపై చర్యలు తీసుకొని, అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకో వాలని దుబ్బాక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కార్యాలయానికి దుబ్బాక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో తమ గోడుని వెల్లబుచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని 979 సర్వేలో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులకు పట్టా హ‌క్కులు కల్పించకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దుబ్బాక గ్రామంలో గల 979 సర్వే నెంబర్లు గల భూములపై విచారణ చేపట్టి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement