Sunday, April 28, 2024

నవ్వులు పంచిన మాట్లాడే బొమ్మ..

నిజామాబాద్ సిటీ, మే (ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో బాల భవన్ లో జరుగుతున్న వేసవి శిక్షణా తరగతులలో భాగంగా జాదు రంగనాద్ ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ ప్రదర్శన పిల్లలందరికి ఎంతగానో నచ్చి నవ్వులతో మారుమోగి పోయింది. పిల్లలంతా కేరింతలతో, చప్పట్లుకొంటి తమ ఆనందాన్ని ప్రకటించారు. బొమ్మ మాట్లాడిన ప్రతీమాట నవ్వులు తెప్పించింది. తనా పెద్దక్కనంటూ.. తన కవిత్వం వినాలంటే.. తలుపులన్నీ మూసి వేయాలి అప్పుడే చెబుతాను అంటుంది బొమ్మ. ఎందుకూ అని అడిగితే! తన కవిత్వానికి గాడిదలు వస్తాయి అంటుంది. ఇలా ఎన్నో జోకులు పిల్లలను అలరించాయి. తన పేరు టింకూ అని తన తండ్రి దస్తగిరి అని, తన అన్న యాదగిరి అని తనది భువనగిరి తెలిపింది. అంతే కాకుండా బొమ్మ పిల్లలలోని తెలివి తేటలు పరీక్షిస్తూ మన డిఈవో ఎవరని, కలెక్టర్ ఎవరూ అని వారితోకి చెప్పించింది. ఈ కార్యక్రమంలో బాల భవన్ సూపరింటెండెంట్ విఠల్ ప్రభాకర్ తో పాటు ఉమాబాల, వెంకట లక్ష్మి, లక్ష్మణ్, పుష్పలత, ఆర్చాక, కోల్పిన, లత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement