Saturday, May 11, 2024

పార్టీ కోస‌మే రాజీ ప‌డ్డాను – డి కె శివ‌కుమార్

న్యూఢిల్లీ – పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తాను రాజీపడ్డానని కర్ణాటక కాబోయే ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. కర్ణాటక ప్రజలకు మా నిబద్ధత నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, కాబట్టి తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి, ఆయన కుటుంబానికి తలవంచాల్సిందే అన్నారు. పార్టీ ప్రయోజనాల కోసమే తాను అంగీకారం తెలిపానన్నారు. కర్ణాటక ప్రజలకు మేం ఎంతో చేయాల్సింది ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్రానికి కొత్త ఉపముఖ్యమంత్రిగా ఉండాలన్న పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తాను అంగీకరించినట్లు తెలిపారు. నాలుగు రోజుల అనిశ్చితి తర్వాత, కాంగ్రెస్ సీఎంగా సిద్ధరామయ్యను, ఉప ముఖ్యమంత్రిగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ శివకుమార్‌ను ప్రకటించింది. దీంతో ఈ ఇద్ద‌రూ 20వ తేదిన చీఫ్ మినిస్ట‌ర్,డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ లుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement