Friday, February 23, 2024

ప్రతిభ వెలికితీసేందుకే క్రీడలు : ఐక్యత ఫౌండేషన్ చైర్మన్

కల్వకుర్తి రూరల్: మే 18 (ప్రభ న్యూస్) : క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసెందుకే క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగిoదని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పంజుగుల గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ లీగ్-2 క్రికెట్ పోటీలను రాఘవేందర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాఘవేందర్ రెడ్డి మాట్లాడారు. క్రీడలతో దేహదారుఢ్యాo, స్నేహ సంబంధాలు, మనసికోలాసం కలుగుతాయన్నారు. గ్రామీణ క్రీడాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత అందరిపై ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటేలా క్రీడాలను నిర్వహించుకోవాలని రాఘవేందర్ రెడ్డి సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, గ్రామస్తులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement