Monday, May 20, 2024

TS: చీపురు పట్టిన పోలీస్…

ధర్పల్లి : సమాజంలోని చెత్తతో పాటు రోడ్ల మీద చెత్తను కూడా ఏరిపారేస్తామని ధర్పల్లి పోలీసులు అంటున్నారు. వివరాల్లోకి వెలితే… మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి పాత బస్టాండ్ వరకు ధర్పల్లి పోలీసులు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కలిసి రోడ్డును ఊడ్చి శుభ్రం చేయడం జరిగింది.

స్థానికంగా ఉన్న దుకాణాదారులు చెత్తను సరిగ్గా ఊడవకపోవడంతో.. పరిసరాలు అద్వాన్నంగా తయారవడంతో.. పోలీసులే చొరవ తీసుకొని పారిశుద్ధ్య కార్మికుల సహాయంతో రోడ్డును ఊడ్చి శుభ్రం చేయడం జరిగింది. పోలీసులే స్వయంగా చీపురులు పట్టి రోడ్డును శుభ్రపరచడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి ఏఎస్ఐ ప్రసాద్ తో పాటు, హోంగార్డ్ నాంజి, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement