Saturday, October 5, 2024

Nizamabad – కార్తీక మహా దీపోత్సంలో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)20: కార్తీక మాసం సందర్భంగా కార్తీక మహాదీపోత్సంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం నిజామాబాద్ లోని నీలకం ఠేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలియదిరిగారు.

ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చ టించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ… అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలిపారు. కార్తీక మాసానికి, నీలకంఠేశ్వర స్వామివారికి తమకు ఎంతో అనుబంధం ఉందని, చాలా ఏళ్ళ నుంచి కార్తీక పౌర్ణమినాడు ఈ ఆల యానికి వస్తుంటామని చెప్పా రు. కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement