Monday, April 29, 2024

ASSOCHAM : సోహార్ పోర్ట్, ఫ్రీజోన్ ఆఫ్ ఒమన్‌తో అసోచామ్ ఇంటరాక్టివ్ సెషన్ బీ2బీ సమావేశాలు

హైదరాబాద్ : అత్యున్నత పరిశ్రమ సంస్థ, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సోహార్ పోర్ట్, ఒమన్‌లోని ఫ్రీజోన్ నుండి విశిష్ట ప్రతినిధి బృందంతో తమ వ్యాపార కార్యక్రమం, ఇంటరాక్టివ్ సెషన్, బీ2బీ సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమాలు ఈనెల 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరగనున్నాయి.

ఈసంద‌ర్భంగా అసోచామ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణా డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ అండ్ యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రవి కుమార్ రెడ్డి కటారు మాట్లాడుతూ… దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రంగా ఉంటే ఎలక్ట్రానిక్స్, ఐటి, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ వంటివి అభివృద్ధి చెందుతున్న రంగాలుగా వున్నాయన్నారు. గత దశాబ్ద కాలంలో నగరం నుండి ఎగుమతుల పెరుగుదలను తాము చూసినప్పటికీ, హైదరాబాద్ నిజమైన సామర్థ్యాన్ని ఇంకా ఉపయోగించుకోలేదని తాము దృఢంగా విశ్వసిస్తున్నామన్నారు. త‌మ రాబోయే సెషన్ ఈ సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement