Wednesday, May 8, 2024

జలదిగ్బంధంలో నిర్మల్ పట్టణం … డేంజర్ లో కడెం ప్రాజెక్టు

నిర్మల్ ప్రతినిధి. కడెం జులై 27 ప్రభా న్యూస్ – నిర్మల్ జిల్లాలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ పట్టణం జగదిగ్బంధంలో చిక్కుకుంది. మంచిర్యాల చౌరస్తా రోడ్డు మార్గం వర్ధనీరు ప్రవహించడంతో మోకాల పెట్టు లోతు నీరుతో రోడ్డుపై నిలిచిపోయింది. దీంతోపాటు కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో భారీ వర్షాలతో ఆ ప్రాజెక్టుకు పెద్దెఏత్తున వరద నీరు వచ్చి చేరుతుంది . కడెం ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు రావడంతో ఆ ప్రాజెక్టు ప్రమాదస్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టుకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన స్థానికులతో పాటు అధికారులు ఉన్నరు. ప్రాజెక్టు పై నుండి నీరు ప్రవహిస్తుంది.


ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 700 అడుగులు(7.603 టీఎంసీలు). ప్రస్తుతం ప్రాజెక్టులో 701.07 అడుగుల(8.067 టీఎంసీలు) కు నీరు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి 386284 c/s నీరు ఇన్స్లోగా వస్తోంది. ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా.. 14 గేట్లు మాత్రమే తెచ్చుకున్నాయి. మరో నాలుగు గేట్లు మోరాయిస్తున్నాయి. దీంతో 242901c/s మీరు మాత్రమే కిందికి వదులుతున్నారు. జర్మన్ క్రస్ట్ గేట్లపై నుంచి వరదనీరు పారుతోంది.

ఇన్ఫ్రా కంటే అవుట్ ఫ్లో తక్కువగా ఉండడంతో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని.. ఆందోళన అధికారుల వ్యక్తం అవుతుంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులతో పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకునేందుకు కడెం బయలు దేరారు.


మరోవైపు స్వర్ణప్రాజెక్ట్ గేట్లు అధికారులు తెరిచారు. ఎస్సారెస్పీ కూడా భారీగా వర్ధన్ రావడంతో ఆ ప్రాజెక్టులు గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. దీంతో గోదావరికి వరద మరింత పెరగనుంది. ఎస్సారెస్పీ గేట్లు ఎత్తితే మాత్రం కడెం ప్రాజెక్టు నీరు గోదావరిలో కలిసే పరిస్థితి ఉండదు. వరద ఉధృతికి నీరు వెనక్కి వచ్చి గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం జారీ చేశారు. ఇప్పటికే 12 గ్రామాలకు చెందిన 7 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు చేశారు. దీంతోపాటు జిల్లాలోని గడ్డిన వాగు స్వర్ణ ప్రాజెక్టులో గేట్లను కూడా తెలిసి దిగకు వరద నీటిని వదులుతున్నారు.

- Advertisement -

గాడ్డేన్నవాగు ప్రాజెక్ట్

FRL: 358.70 మీ
కెపాసిటీ: 1.852 TMC
ప్రస్తుత నీటి మట్టం:357.80మీ
ప్రస్తుత కెపాసిటీ : 1.379TMC
ఇన్ ఫ్లోలు : 16410 క్యూసెక్కులు
ప్రవాహాలు : 23140 క్యూసెక్కులు
3 గేట్లు తెరిచారు

Advertisement

తాజా వార్తలు

Advertisement