Sunday, April 28, 2024

Nims: నిమ్స్‌లో కడుపు నొప్పి భరించలేక ఓ రోగి ఆత్మహత్య

హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కడుపు నొప్పి భరించలేక ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా వై లక్ష్మాపురానికి చెందిన అచ్చయ్య గత కొంతకాలం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు.

దీంతో జనవరి 16వ తేదీన చికిత్స కోసం అచ్చయ్య నిమ్స్‌కు వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అచ్చయ్య నిమ్స్ స్పెషాలిటీ బ్లాక్‌లోని రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిమ్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement