Thursday, May 2, 2024

TS : బిఆర్ఎస్ ఎంపి అభ్య‌ర్ధులుగా కొత్త మొఖాలు…

తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండడంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వేగం పెంచాయి. మొత్తం 17 పార్లమెంట్‌ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోవడానికి వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

- Advertisement -

ఇప్పటికే కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌ నగర్‌ లోక్‌సభ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. తాజాగా మరో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. మల్కాజ్‌గిరికి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌, మెదక్‌లో ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి, జ‌హీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌ కుమార్‌లను పోటీకి పెట్టాలని ప్రతిపాదించింది.

శంబీపూర్ కూ ల‌క్కీ ఛాన్స్
మల్కాజిగిరితో పాటు మిగిలిన మూడు స్థానాలకు టికెట్‌ తమకే కావాలంటూ చాలా మందే బీఆర్‌ఎస్‌ నేతలు మంతనాలు జరిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కుమారుడికి టికెట్‌ ఇప్పించుకోవాలని అనుకున్న ఎందుకో చివ‌రి నిమిషంలో డ్రాప్ అయ్యారు.. దీంతో ఊహించ‌ని విధంగా శంబీపూర్ రాజు లైన్ లోకి వ‌చ్చారు…

కాసానికి జాక్ పాట్..
ఇక చేవెళ్ల విషయంలోనూ అంతే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరిన కాసానికి టికెట్‌ దక్కింది. ఇక్కడ్నుంచి సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తారని నిన్న, మొన్నటి వరకూ ప్రచారం జరిగినా ఆయన పోటీకి ససేమిరా అన్నట్టు సమాచారం. తాజాగా ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో కాసాని జ్ఞానేశ్వ‌ర్ కు ఈ సీటు ద‌క్కింది..


ఇక మెదక్‌ నుంచి చాలా పేర్లే తెరపైకి వచ్చినప్పటికీ సీనియర్‌ నేత వంటేరును టికెట్‌ వరించింది. ఇక అనిల్‌ కుమార్‌ కూడా అంతే. మొత్తానికి చూస్తే.. ఈ నలుగురు అభ్యర్థులూ ఊహించనివారే.

Advertisement

తాజా వార్తలు

Advertisement