Thursday, October 10, 2024

బి అర్ ఎస్ పార్టీకి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

భారత రాష్ట్ర సమితి పార్టీకి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా భారత రాష్ట్ర సమితి పార్టీకి దూరంగా ఉంటున్న మైనంపల్లి హనుమంతరావు… ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు.

తాను భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నానని… కార్యకర్తలు మరియు సన్నిహితుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు మైనంపల్లి హనుమంతరావు.త్వరలోనే మరో పార్టీలో చేరుతానని… ఆ పార్టీని త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

కాగా మల్కాజ్గిరి టికెట్ ను మైనంపల్లి హనుమంతరావు కు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కూడా మెదక్ టికెట్ కావాలని మైనంపల్లి హనుమంతరావు డిమాండ్ చేశారు.కానీ భారత రాష్ట్ర సమితి అధిష్టానం… మైనoపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హనుమంతరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక తాజాగా భారత రాష్ట్ర సమితి పార్టీకి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement