Friday, December 1, 2023

తెలంగాణ సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ స్కీం గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విదేశాల్లో చదువుకునేందుకు మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 25 వరకు పొడిగించింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 25 సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్‌ విండో అందుబాటులో తెరిచి ఉంటుందని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ విద్యార్థుల నుంచి 600 పైగా దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement