Thursday, May 2, 2024

Mudiraj’s Protest – ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం

చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక కేంద్రంలో ముధిరాజ్ మహాసభ అధ్వర్యంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ ను దగ్దం చేశారు గత రెండు రోజుల క్రితం హుజారాబాద్ లో జరిగిన ఓ సంఘటనలో ముధి రాజ్ కులం పట్ల అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ తో శవ యాత్ర నిర్వహించి దగ్దం చేశారు.

ఈ సందర్భంగా పలువురు ముధిరాజ్ నాయకులు మాట్లాడుతూ ముదిరాజ్ కులం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి నీ బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ పదవినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి సదనాబోయిన కృష్ణ , నెన్నెల సమ్మయ్య నాయిని మధునయ్య, జోడుశంకర్, తుమ్మ రమేష్, పిట్టల రవి, అట్టెం రాజబాబు, నెన్నేల భీమయ్య, పాతర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement