Thursday, May 9, 2024

డిచ్ పల్లి రైల్వే స్టేషన్ లో పాదచారుల వంతెన ను నిర్మించండి

నిజామాబాద్ మార్చ్ 13 ప్రభ న్యూస్ – నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి రైల్వే స్టేషన్ లో పాదచారుల వంతెనను నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి కోరారు. సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో జీఎం తో భేటీ అయ్యారు. రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ప్లాట్ ఫామ్ లు మారడానికి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని , అంతేకాకుండా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంపీ రైల్వే జీఎంకు వివరించారు. రైల్వే స్టేషన్ కు అవతల వైపు ఎమ్మార్వో,ఎంపీడీవో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మానవతా సదన్ తదితర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలు అనేకం ఉన్నాయని దీనివల్ల ప్రయాణికులు,విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన జిఎం దృష్టికి తీసుకొచ్చి సత్వరమే పాదచారుల వంతెన మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు . దీనివల్ల డిచ్ పల్లి , మోపాల్ పరిధిలో గల అనేక గ్రామాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. అంతేకాకుండా ఆర్మూర్, మాధవ్ నగర్,అర్సపల్లి, బోధన్ ఆర్ఓబిల నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులు, ఆర్మూర్- ఆదిలాబాద్ మరియు బోధన్- బీదర్ రైల్వే లైనులకు సంబంధించి పలు పెండింగ్ అంశాలు జీఎంతో చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement