Thursday, May 2, 2024

టూరిస్టులకు మరిన్ని సౌలతులు.. నాగులబండ వద్ద త్రీ స్టార్ హోటల్

సిద్దిపేట, (ప్రభ న్యూస్‌) : సిద్దిపేట శివారు నాగుల బండ వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్‌ను మంత్రి హరీష్‌ రావు టూరిజం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్‌ నిర్మాణ పనులు క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట ప్రాంత వాసులు, కీలక అధికారులు, విదేశాలు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఇక్కడ పర్యటించిన సందర్భాల్లో వారు హైదరాబాద్‌ నుండి రాకపోకలు సాగిస్తుంటారని, అలాంటివారి కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పరిధిలోని నాగులబంద వద్ద త్రీ స్టార్‌ లెవల్‌లో టూరిజం హోటల్‌ను నిర్మిస్తున్నట్లు, మూడు స్యూట్‌ రూమ్స్‌, 28 గెస్ట్‌ రూమ్స్‌ రెస్టారెంట్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

తక్కువల ధరకు మంచి టిఫిన్‌, భోజనంతోపాటు సౌకర్యవంతమైన వసతిని వెయ్యి మందితో ఫంక్షన్‌ చేసుకునే వీలుగా బాంకెట్‌ హాల్‌ ఏర్పాటు చేశామని, విశాలమైన లాన్‌లో కూడా ఫంక్షన్‌లు చేసుకునేలా సిద్దిపేట ప్రజల అవసరాల నిమిత్తం త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సిద్దిపేట కళలకు, కళాకారులకు పెట్టింది పేరు అని, ఆ కళను ఒడిసి పట్టేలా కాపు రాజయ్య, బాసిక్‌ బాలయ్య, రుస్తుం, చేర్యాల నకాశి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌ రెడ్డి, సుడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌ రెడ్డి, పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement