Saturday, April 20, 2024

ప్రభుత్వ ఉద్యోగమంటూ వసూళ్లకు పాల్పడ్డ ముఠా

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగావకాశం కల్పిస్తామంటూ నలుగురు సభ్యుల ముఠా పక్కాగా, ప్లాన్ చేసి అమాయకులకు ఆశలు చూపి అక్రమార్జనకు వ‌డిగడుతున్న ముఠా బాగోతం బయటపడింది. హ‌న్మ కొండలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తిప్పని శివకుమార్ కు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో స్కౌట్ మాస్టర్ ఉద్యోగావకాశం కల్పిస్తామని నలుగురు సభ్యుల ముఠా తనను 3 లక్షల 50 వేల రూపాయాలు డిమాండ్ చేశారని, అందుకు గాను తాను మొదటి దఫాగా ఒకలక్ష 20 వేలు ఇచ్చానని సుబేధారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిప్పని శివకుమార్ ఫిర్యాదు మేరకు సుబేధారి పోలీసులు చేపట్టిన విచారణలో ఈ నలుగురు సభ్యుల ముఠా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడి మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు.

తిప్పని శివ కుమార్ వద్ద ఒక లక్ష 20వేలు వసూలు చేసిన తర్వాత, నల్గొండకు ట్రైనింగ్ కు తీసుకెళ్లి అక్కడ మిగిలిన 2 లక్షల 30 వేలు ఇవ్వాలని వెంట పడుతుండటంతో,ఆ మొత్తం అమౌంట్ ను కూడా ఇచ్చాడు. నల్గొండ నుండి హన్మకొండకు వచ్చిన తర్వాత జాబ్ పని ఎంత వరకు వచ్చిందో తెలుసుకొనేందుకు ఫోన్ చేస్తుంటే, లిఫ్ట్ చేయడం లేదు. పైగా హౌస్సింగ్ బోర్డు కాలనీలో నివాసమున్న రాహుల్ నిలదీయడంతో, రాహుల్ బెదిరింపులకు పాల్పడతంతో అనుమానం మొదలైంది. దాంతో వ్యవహారం తెలుసుకొనే ప్రయత్నం చేసేందుకు గాను ఫ్రెండ్స్ తో చర్చించాడు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగ నియామకాలు ఎలా జరుపుతారని మిత్రులు చెప్పడమే కాక, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ఖాళీలు ఉన్నాయో, లేదో కనీసం తెలుసుకొన్నవా అని ఫ్రెండ్స్ ప్రశ్నించడంతో శివకుమార్ లో అనుమానం మరింత పెరిగిపోయింది. ఉద్యోగావకాశం కల్పిస్తామన్న వారి ఆఫీస్ వద్దకు వెళ్లి ఎంక్వైరీ చేశాడు.

తన వద్దనే కాక అనేక మంది వద్ద ఉద్యోగావకాశం కల్పిస్తానని ఆశలు కల్పించి మోసం చేస్తున్నట్టు గ్రహించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుబేధారి పోలీస్ స్టేషన్ లో హన్మకొండ, హౌస్సింగ్ బోర్డ్ కాలనీకి చెందిన తిప్పని శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన‌ట్లు ఇన్ స్పెక్ట‌ర్ అల్లే రాఘవేందర్ తెలిపారు. ధరవత్. రాజేష్ (స్కౌట్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ ) రాహుల్ ( స్కౌట్ అండ్ గైడ్స్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ కమీషనర్), పోరిక.అనసూర్య ( స్టేట్ ఆర్గనైజేషన్ కమీషనర్, తెలంగాణ ), వినాయపాల్ రెడ్డి (స్టేట్ ఆర్గనైజేషన్ కమీషనర్, ఆంద్రప్రదేశ్ ) లు ప్రభుత్వ సంస్థగా పరిచయం చేస్తూ, నిరుద్యోగులకు టోకరా ఇస్తున్నట్టు గుర్తించి, కేసు నమోదు చేశారు. ఈ ముఠా సభ్యులు హన్మకొండ హౌస్సింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఎన్ శ్రీకాంత్ వద్ద 3 లక్షల 50 వేలు, ఎన్. నలినికాంత్ నుండి 3 లక్షలు, హన్మకొండ, అమరావతినగర్ కు చెందిన కె.భవాని వద్ద 3 లక్షలు, హన్మకొండ అశోక్ కాలనీకి చెందిన పి.జ్యోతి వద్ద నుండి ఒక లక్ష రూపాయలు వసూళ్ళు చేసిన‌ట్లు బయట పడ్డాయి. మరింత మంది బాధితులు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్యోగావకాశం కల్పిస్తానని మోసం చేసిన నలుగురి పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సుబేధారి ఇన్ స్పెక్ట‌ర్ అల్లే రాఘవేందర్ తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement