Saturday, April 27, 2024

Flash: ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకి కరోనా పాజిటివ్

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను ఖమ్మంలో తన నివాసంలో హోమ్‌ క్యారంటైన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందన్నారు. స్వల్ప లక్షణాలుండటంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నానని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో అందరి ముందుకొస్తా అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement