Tuesday, May 14, 2024

బతుకమ్మకుంటలో వెంటనే చర్యలు చేపట్టాలి, అధికారులకు ఎమ్మెల్యే కాలేరు ఆదేశం

అంబ‌ర్ పేట – ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారాలు అందిస్తున్నారు. నేడు ఎమ్మెల్యే బతుకమ్మకుంట ప్రాంతంలో పర్యటించి, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా, బస్తీ ప్రజలు డ్రైనేజీ సంబంధిత సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే పరిస్థితిని అర్థం చేసుకొని, వర్షాల కారణంగా పై ప్రాంతాల నుండి డ్రైన్ల నుండి వచ్చే నీరు బతుకమ్మ కుంట ప్రాంతంలో నిలుస్తోందని, కాబట్టి రోజు డ్రైన్లను డిసిల్టింగ్ చేసి నీటి ప్రవాహం కొనసాగేట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే బస్తీలో ప్రతి రోజూ పారిశుధ్య నిర్వహణ సరిగ్గా జరిగేలా చూడాలని సూచించారు

సీఈ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

బాగ్ అంబర్ పేట డివిజన్ సీఈ కాలనీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. అక్కడ వీధి దీపాలు వెలగడం లేదని, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయడం లేదని, కాలనీలో వాహనాలు వేగంగా వెళ్లడాన్ని నిరోధించడానికి స్పీడ్ బ్రేకర్లు కావాలని, ప్రస్తుతం వర్షాల వలన నీరు నిలిచి ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఎమ్మెల్యే గారికి తెలిపారు. అలాగే కాలనీలోని పార్క్ ను అభివృద్ధి చేయాలని, కాలనీలోకి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేయడం లేదా వేరే బస్సుల రూటు మార్చి ప్రయాణం సులభతరం చేయాలని, వారు ఎమ్మెల్యే ని కోరారు.

ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే కాలనీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement