Thursday, May 16, 2024

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామ‌న్న ఎమ్మెల్యే దాసరి

రైతాంగం కష్టించి పండించిన వరి ధాన్యంకు మద్దతు ధర చెల్లించి చివరి వరకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, పెద్ద రాత్పల్లి, మొట్లపల్లి, కిష్టం పేట, పందిళ్ళ, తారుపల్లి, మాల్యాల, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నఅనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశారని రైతుబంధుతో ముందస్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రపంచంలో ఎక్కడా ఈ పథకం అమల్లో లేదన్నారు. రైతు బీమాతో మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతాంగం నష్టపోకుండా ఉండేందుకు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement