Wednesday, May 1, 2024

పెళ్లిపీట‌లెక్క‌నున్న ‘సుడిగాలి సుధీర్’..వ‌ధువు ఎవ‌రో తెలుసా..!

యాంక‌ర్ గానే కాదు హీరోగా కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుడిగాలి సుధీర్ ప‌రిచ‌య‌మే. జ‌బ‌ర్థ‌స్త్ కామెడీ షో ద్వారా సుధీర్ కి బాగా పాపులారిటీ వ‌చ్చింది. ఇక ఢీ షోలో యాంక‌ర్ ర‌ష్మీతో క‌లిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. వీరిద్ద‌రు ల‌వ‌ర్సా అనేంత‌గా రొమాన్స్ ని పండిస్తుంటారు. అయితే ఇదంతా ఆ షోల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌ని ఇప్ప‌టికే తెలిపారు. కాగా సుధీర్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. సుడిగాలి సుధీర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స‌మాచారం. తన కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఈ పెళ్లి సంబంధం కుదిరింద‌ట‌. విజయవాడకి చెందిన సుధీర్, కృష్ణ జిల్లాకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. దాంతో సుధీర్,ర‌ష్మీల మ‌ధ్య ఉంది ఫ్రెండ్ షిప్ మాత్ర‌మేన‌ని తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement