Monday, April 29, 2024

మైనర్ బాలికకు పెళ్లి.. అడ్డుకున్న అధికారులు …

నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామనికి చెందిన 14 సంవత్సరాల బాలికకు ఆదివారం నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ గ్రామానికి చెందిన 33 సంవత్సరాల యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం గ్రామానికి వచ్చిన బాలిక బాల్య వివాహం ఇష్టంలేక గ్రామ సర్పంచ్ ఖానిష్ ఫాతిమను ఆశ్రయించింది.

సర్పంచ్ ఐసీడీఎస్ అధికారులకు,పోలీసులకు సమాచారం అందించగా అధికారులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి బాలికను నిర్మల్ సఖీ కేంద్రానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement