Monday, April 29, 2024

Gang Rape: వనపర్తిలో అమానుష ఘటన.. లిఫ్ట్ ఇస్తామని బాలికపై అత్యాచారం

తెలంగాణలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. కాలినడకన స్కూల్‌కి వెళ్తున్న మైనర్ బాలికకు లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. బాలికను బెదిరించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది.

పాన్‌గల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) చింతకుంట జిల్లా పరిషత్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పాఠశాలకు రోజు మాదిరిగానే స్నేహితురాళ్లతో కలసి పాఠశాలకు కాలినడకన బయలుదేరింది. అయితే, మార్గం మధ్యలో అదే గ్రామానికి చెందిన నాగరాజు, అనిల్ అనే ఇద్దరు యువకులు రెండు బైకులపై వచ్చి లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అనిల్ ఇద్దరు బాలికలను బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నాగరాజు బాలికను బైక్ ఎక్కించుకుని స్కూల్‌కి వెళ్లకుండా దారిమళ్లించాడు. పొదల్లోకి తీసుకెళ్లి బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇంతలోనే ఇద్దరు బాలికలను పాఠశాల వద్ద దింపేసి వెనక్కి వచ్చిన అనిల్ కూడా బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితురాలు జరిగిన దారుణాన్ని పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు చెప్పింది. దీంతో వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్‌కి తెలియజేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు కీచకులను అరెస్ట్ చేసిన పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ మనోహర్ హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement