Friday, December 1, 2023

 Satyavathi Rathod: మాన‌వ‌త్వం చాటుకున్న మంత్రి స‌త్య‌వ‌తి 

మంత్రి సత్యవతి రాథోడ్ మానవత్వం చాటుకున్నారు. ఆదివారం ఉదయం మంత్రి సత్యవతి తన కాన్వాయ్‌లో మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. తొర్రూరు ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఫిట్స్ రావడంతో కిందపడిపోయారు. అదే ఆ మార్గం గుండా వెళ్తున్న మంత్రి అతడిని గమనించారు.

- Advertisement -
   

వెంటనే తన కాన్వాయ్‌ని పక్కకు ఆపి అతడిని పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన అతడికి సపర్యలు చేశారు. వెంటనే అంబులెన్సును పిలిపించి సమీపంలోని దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement