Thursday, September 16, 2021

సీఎం పదవి తప్ప అన్ని అనుభవించాడు: ఈటలపై హరీష్ వ్యాఖ్య

హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హుజురాబాద్ ప్రజలపై ఈటల మొసలి కన్నీరు కారుస్తున్నాడని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈటలకు సీఎం పదవి తప్ప అన్ని పదవులను టీఆర్ఎస్ కల్పించిందని గుర్తు చేశారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఈటల వ్యవహారం ఉందన్నారు. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల.. బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని ఈటలను ప్రశ్నించారు. దేశంలో ప్రభుత్వ రంగల సంస్థల అమ్మకానికి పెట్టింది పేరు బీజేపీ అని హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని నిలదీశారు. కాజీపేటకు రావాలసిన కోచ్ ఫ్యాక్టరీని విస్మరించి లాతూర్‌కు తీసుకెళ్లిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News