Thursday, May 2, 2024

Breaking | పరిపాలనలో మనమే నెంబర్​వన్​: సీఎం కేసీఆర్​

తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్​వన్​
అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదిగాం
24 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు, ఎస్పీ ఆఫీసులు ప్రారంభం
కొత్త భవనాల ఆర్కిటెక్చర్ మన సంస్కృతికి నిదర్శనం
తెలంగాణ బిడ్డనే ఈ నిర్మాణాలను చేపట్టారు
పరిపాలన చేతకాదన్న వారికి ఇదే చెంపపెట్టు
మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను ప్రారంభించిన సీఎం కేసీఆర్

(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్)

తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందినదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎస్పీ ఆఫీసు, కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించిన తర్వాత ఆయన అధికారులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలోనే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగిందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సరైన అసెంబ్లీ, సెక్రెటేరియట్‌ కూడా మన కలెక్టరేట్ భవనాల మాదిరిగా లేవన్నారు. తెలంగాణలో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడమేగాక, ఇప్పుడు 24వ కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని సీఎం అన్నారు. నూతన కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించుకున్నందుకు మెదక్‌ జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మెదక్‌ కలెక్టరేట్‌ ఆర్కిటిక్చర్‌ అయిన ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని సీఎం కేసీఆర్‌ సభాముఖంగా ఆమెను అభినందనందించారు.


తెలంగాణే నెంబర్ 1
దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉన్నదని, స్వచ్ఛమైన నీటిని ఇంటింటికీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న ఈ పరిపాలనా భవనాలు చూస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసిపోతుందన్నారు. గతంలో చేతగాని పాలకుల వల్ల రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా నాటి చేతగాని పాలకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.200 ఉన్న ఆసరా పింఛన్‌లను ఇప్పుడు రూ.4016కు తీసుకొచ్చామని చెప్పారు.


సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సీఎం సమావేశం సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. దేశం, రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు చూసే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెం.1 నిలిచిందని, – దేశంలో స్వచ్చమైన తాగునీరు ప్రతి ఇంటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. – అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే అన్నారు.- గతంలో 23 లక్షలు మాత్రమే పెన్షన్ లు ఉండేదని, ప్రస్తుతం 54 లక్షల పెన్షన్ దారులున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో పెన్షన్ని మరింత పెంచుతామని, ఇక.. గణపురం ఆయకట్టు ఎలా బాగు చేసుకున్నామో మన అందరికీ తెలుసన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ లు త్వరలోనే పూర్తి చేస్తామని, మంజీరాలో అనేక చెక్ డ్యాంలు కట్టుకున్నామని, పచ్చని పంటలతో మెదక్ అలరాలుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.

పెంచిన పించన్ల అందజేత

మెదక్ నూతన కలెక్టరేట్ వేదికగా దివ్యాoగులకు రూ.3016 నుండి రూ.4016- లకు పెంచిన ఆసరా పెన్షన్ లను కొంత మంది లబ్ధిదారులకు అందించి పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా గతంలో బీడీ కార్మికులకు, ఇప్పుడు బీడీ టేకేదార్లకు, ఫ్యాకర్లకు ఆసరా పెన్షన్ వర్తింపు కార్యక్రమాన్ని కూడా లబ్ధిదారులకు అందించి సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.



ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. అత్యధిక వేతనాలు తీసుకుంటున్నది మనమే: సీఎస్ శాంతికుమారి
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అయిన సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడారు. ఇప్టపికే 23 సమీకృత కలెక్టరేట్ భవనాలు ప్రారంభించుకున్నామని, మెదక్ ది 24వది అన్నారు. అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయని చెప్పారు. తాను ఇక్కడే వివిధ హోదాల్లో నాలుగేండ్లపాటు పని చేశానని, సీఎం కేసిఆర్ సారథ్యంలో తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిందన్నారు. -తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందని సీఎస్ శాంతి కుమారి అన్నారు.- దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది కూడా తెలంగాణనే అని,- ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ స్టేట్ గా తెలంగాణ నిలిచిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement