Thursday, May 2, 2024

వర్షాలకు కూలిన కోర్టు గోడ.. తప్పిన పెను ప్రమాదం..

నర్సాపూర్: పట్టణంలోని మున్సిఫ్ కోర్టు ప్రధాన హాల్ గోడ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి గురువారం రాత్రి కూలిపోయింది. రాత్రి సమయంలో కోర్టు గోడ‌ కూలడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని న్యాయ‌వాదుల‌తో పాటు ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకున్నారు. కోర్టు వ్యవహారాలు కొనసాగుతున్న సమయంలో గోడ కూలినట్లయితే న్యాయవాదులు, ప్రజలకు ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.

గత 35 సంవత్సరాల కింద నిర్మించిన భవనం అయినందున ఆ భవనం శిథిలావస్థకు చేరిందని, ఈ విషయమై హై కోర్ట్ జడ్జి దృష్టికి గత ఆరు నెలల కిందట తీసుకువెళ్లిన పట్టించుకోలేదని న్యాయవాది అంజిరెడ్డి తెలిపారు. కోర్టు గోడ కూలడంతో భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ప్రస్తుతం కోర్టు ద్వారా న్యాయ సేవలను నిలిపివేయడం జరిగిందన్నారు. తాత్కాలికంగా భవనం ఏర్పాటు చేస్తే న్యాయ సేవలు ప్రారంభిస్తామని న్యాయవాదులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జడ్జి అనిత శుక్రవారం ఉదయం కోర్టు వద్దకు వచ్చి కూలిన గోడను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement