Friday, April 19, 2024

జాన్సన్‌ స్వయంకృతం..

తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుని అయిన వారందరి చేత పొమ్మనిపించుకున్న బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గురువారంనాడు వేరే దారిలేక పదవికి రాజీనామా చేశారు. ఆయన నియమించిన మంత్రులే ఆయనను దిగి పొమ్మనమని డిమాండ్‌ చేయడం బోరిస్‌ స్వయం కృతంగానే భావించాలి.బ్రిటిష్‌ ప్రధానమంత్రుల్లో ఇంత అగౌరవంగా గద్దెదిగిన వారు లేరు.గతంలో మార్గెరెట్‌ థాచర్‌,టోనీ బ్లెయిర్‌ వంటి వారు కూడా వివాదాల కారణంగానే పదవినుంచి దిగాల్సి వచ్చింది.ఐరన్‌ లేడీ గా పేరొందిన థాచర్‌ అనేక కుంభకోణాల్లో చిక్కుకుని చివరికి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అలాగే, టోనీ బ్లెయిర్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ జూనియర్‌ చెప్పినట్టు వినడం వల్ల పదవికే ఎసరు తెచ్చు కున్నారు. జార్జి బుష్‌ దుందుడుకు విధానాల వల్లనే అఎn్గా నిస్థాన్‌, ఇరాన్‌లపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళా లు దాడి చేశాయి. ఈ సంకీర్ణ దళాల్లో అమెరికాకు బ్రిటన్‌ పూర్తి తోడ్పాటును అందించింది.జార్జి బుష్‌ జరిపించిన దాడుల్లో తమ దేశం పాల్గొనడం బ్రిటన్‌ పౌరులకు ఇష్టం లేదు. జార్జి బుష్‌ ఒత్తిడి కారణంగానే బ్లెయిర్‌ ఈ దాడుల కు సహకారం అందించారని బ్రిటన్‌ పౌరులు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. అంతేకాదు, ఈ దాడుల్లో అమెరికన్‌ సైనికుల కన్నా, బ్రిటిష్‌సైనికులే ఎక్కువ మంది మర ణించారు.

ఆ సైనికులకుటుంబాల వారు,వారి బంధు మిత్రులు బ్రిటన్‌లోనూ, అమెరికాలోని పలునగరాల్లో జార్జిబుష్‌, బ్లెయిర్‌లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. దాంతో ఆయన పదవి నుంచి దిగిపోవల్సి వ చ్చింది. అయితే, అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ కూటమిలో కొనసాగడం వల్లనే విధిలేక తమ సేనలను ఈ రెండు దేశాలపై దాడులకు పంపాల్సి వచ్చింది. అయితే, ప్రాణనష్టం అధికం కావడం వల్ల బ్రిటన్‌లోని సైనికుల కుటుంబాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శ లు వెల్లువెత్తడంతోఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాతఆయన తీసుకున్న నిర్ణయాలపై తదుపరి ప్రభుత్వం నియమించిన కమిటీ ఆయనను దోషిగా నిల బెట్టింది.బ్లెయిర్‌ తప్పుల కన్నా జాన్సన్‌ తప్పులు తీవ్ర మైనవని కన్సర్వేటివ్‌ పార్టీవారు ఆరోపిస్తున్నారు. కరోనా విజృంభణ సమయంలో టీకాల కార్యక్రమానికి అన్ని దేశాలూ ప్రాధాన్యం ఇచ్చి వ్యాక్సినేషన్‌ను ఒక ఉద్య మంగా జరిపిస్తున్నవేళతన అధికార నివాసంలో జాన్సన్‌ బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేయడాన్ని బ్రిటన్‌ పౌరులు తీవ్రంగా పరిగణించారు.దీనికి అక్కడి మీడియా పార్టీ గేట్‌ అని పేరు పెట్టింది.అంతేకాక, అనేక అవినీతి ఆరోపణలతోపాటు లైంగిక నేరాల ఆరోపణలను ఎదుర్కొంటున్న క్రిస్‌ పింఛర్‌ని తన మంత్రి వర్గంలోకి తీసుకోవడం జాన్సన్‌ చేసిన అతి పెద్ద తప్పుగా బ్రిటిషర్లు పేర్కొంటున్నారు. క్రిస్‌ పింఛర్‌ వల్ల ప్రభుత్వా నికి చెడ్డ పేరు వచ్చిందని వారు బహిరంగంగానే విమర్శ లు గుప్పించారు.

జాన్సన్‌ కోవిడ్‌ రోగుల చికిత్స విష యంలోనూ, వారికి పరిహారంచెల్లించే విషయంలోనూ శ్రద్ధ తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి.ప్రధాన సమ స్యలపై దృష్టి పెట్టకుండా, ప్రతిదానిని తేలికగా తీసుకోవ డం వల్లనే బోరిస్‌ జాన్సన్‌పై వ్యతిరేకత వెల్లువెత్తింది. పార్టీని నమ్ముకుని ఎంతో కాలంగా విధేయులుగా పని చేస్తున్న వారిని కాదని క్రిస్‌ పింఛర్‌కి ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే 40 మంది వరకూ ఎంపీలు తిరుగుబాటు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రతిష్ఠ,దేశ ప్రతిష్ఠ మంటగలిపి ఇష్టారాజ్యంగా జాన్సన్‌ వ్యవహరిస్తున్నారని అంతర్జాతీ య మీడియాలో పుంఖానుపుంఖంగా కథనాలు వెలు వడ్డాయి.జాన్సన్‌కి నమ్మకస్తుల్లో ఒకరైన భారత సంతతి కి చెందిన రుషి సునాక్‌ రాజీనామాతో ప్రారంభమైన తిరుగుబాటు బోరిస్‌ జాన్సన్‌ పీఠానికి ఎసరు తెచ్చింది. తన వారసుని ఎంపిక జరిగే వరకూ పదవిలో కొనసా గుతానని ఆయన ప్రకటించారు. తప్పులు సకాలంలో దిద్దుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదని ఆయన చివరికి అంగీకరించారు.తదుపరి ప్రధా ని రేసులో రిషి సునక్‌ ముందున్నారు.ఆయన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు.

ఎక్స్‌చెకర్‌ చాన్సలర్‌గా ఆయన కరోనా బాధితులకు వంద పౌండ్ల ప్యాకేజీని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.అయితే, తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతగా బోరిస్‌ జాన్సన్‌ జన్మ దినోత్సవ వేడుకలకు హాజరైనందుకు ఆయన జరిమా నా చెల్లించాల్సి వచ్చింది.అయితే,జాన్సన్‌ ఎప్పుడైతే క్రిస్‌ పింఛర్‌ని ప్రోత్సహించడం మొదలుపెట్టారోఅప్పటి నుంచి ఆయనకు దూరంగా ఉంటున్నారు. సునాక్‌ తాత పంజాబ్‌కి చెందిన వారు. ఆయన లండన్‌ వెళ్ళి స్థిరపడ్డా రు. ప్రధానమంత్రి పదవికి ఆయన ఎంపికైతే బ్రిటిష్‌ భారతీయునికి ఆ పదవి లభించినట్టు అవుతుంది. జాన్స న్‌ నిష్క్రమణ పూర్తిగా ఆయన స్వయంకృతం. జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశాల్లోనూ జాన్సన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement