Friday, June 14, 2024

బాత్ రూంలో కుప్ప‌కూలింది..! అనుమానాస్పదంగా విద్యార్థి మృతి..

పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి జ్యోతి బాపూలే జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని బాత్ రూంకు వెళ్లి అక్కడే కడుపు నొప్పితో కుప్పకూలింది. అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది వెంటనే 108కి కాల్ చేయగా విద్యార్థిని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థి చాలా సీరియస్ గా ఉండడంతో గాంధీకి షిఫ్ట్ చేయాలని కోరగా వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని ప్రాణాలు వ‌దిలింది. విద్యార్థి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం లోక్ తండాకు చిందిన‌ట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు. విద్యార్థిని కొంతకాలంగా గైనకాలజీ అనారోగ్యంతో బాధపడుతుంద‌ని ఉపాధ్యాయురాలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement