Sunday, April 28, 2024

TS : ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్…పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్రంగా ఉద్రిక్తత ..

ప‌టాన్‌చెరు, ప్ర‌భ‌న్యూస్ః పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే సోదరునీ అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో అక్రమ క్వారీలు క్రషర్ల నుండి పరిమితికి మించి మైనింగ్ చేశారని తహ‌సిల్దార్ ఫిర్యాదుతో పటాన్‌చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరున్ని గూడెం మధుసూదన్ రెడ్డిని తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు త‌ర‌లించిన‌ట్లు చెప్పారు. . చీటింగ్ మైనింగ్ తో పాటు పాలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement