Monday, April 29, 2024

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట : ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు : రంజాన్ పవిత్ర పర్వదినాన్ని ప్రతి ముస్లిం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఏటా రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని వివిధ మసీదుల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ముస్లింలకు రంజాన్ తోఫాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దేశంలో హిందు, ముస్లిం, క్రిస్టియ‌న్ల‌కు స‌మానంగా చూస్తూ వారి వారి పండుగ‌ల‌కు కేసీఆర్ బ‌తుకమ్మ చీరెలు, రంజాన్ తోఫాలు, క్రిస్మ‌స్ కానుక‌లు అందిస్తున్న ఏకైక ప్ర‌భుత్వం బిఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అన్నారు. రాష్టంలో పేద, ధ‌నిక అన్న తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు సంతోషంగా పండుగ జ‌రుపుకోవాల‌న్న ల‌క్ష్యంతోనే ప్ర‌తి పండుగ‌కు కేసీఆర్ కానుక అందిస్తున్నార‌న్నారు. ఈ ఏడాది అన్ని మ‌తాల వారు క‌ల‌సి ఈద్ ఉల్ ఫిత‌ర్‌ను సంతోష వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు. ముస్లింల కోసం మైనార్టీ క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌లు, గురుకులాలు, షాదీ ముబార‌క్‌, మోజంల‌కు జీతాలు ఇలా ఎన్నో పనులు సీఎం కేసీఆర్ ప్ర‌వేశ పెట్టార‌న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షులు అజ్మత్, మైనార్టీ మత పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement