Friday, April 26, 2024

మద్దతు ధర అందేనా..

పాపన్నపేట : ఈ యాసంగి పటపైనా రైతులు చేతికొచ్చేనా ప్రకృతి సహకరించేనా.. అంటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారుమడి మొదలు కొని విత్తనాలు, ఎరువులు, సాగు, కలుపుతీయుట, వరకు మంజీరా తీరం ప్రాంతంలోని వ్యవసాయ రైతులు ఊపిరి పిల్చుకున్న తరుణంలో ఒక్కసారిగా వ్యవసాయ బోరులో నీరు తగ్గడంతో కొంత మంది రైతులు వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటిని పడుతూ పంట చేనును కాపాడుతున్నారు. పాపన్నపేట, మెదక్‌ మండలాల్లోని రైతులు అధిక సంఖ్యలో వరి సాగు చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో నిబ్బందులు పడిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుసరిస్తున్న విధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించడంతో రైతులు తమ పంట కొనుగోలు చేయద్దనే ఉద్దేశ్యంతో ఆందోళన బాట పట్టిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తీరా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా వరిపంటను కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సోసైటీ, ఐకెపి, మార్కెట్‌ యార్డుల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేయడంతో రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న ఆనందంతో ఉన్న తరుణంగా వరిపంట చేతికొచ్చే తరుణంలో వరిపంటకు నీరు అందకపోవడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి వాటర్‌ ట్యాంకుల ద్వారా పంటకు నీరు అందిస్తున్న సంఘటనలు మండలంలో చాలా గ్రామాల్లో కనిపిస్తున్నాయి. అయితే తము వేల రూపాయలు ఖర్చు చేసి పంటను పండించినప్పటికీ ప్రభుత్వం మద్దతు ధర విషయంలో నేటికి స్పష్టత ఇవ్వకపోడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సన్నరకం, దొడ్డురకం పేరుతో ఇబ్బందులు పడ్డ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు రైతులకు దిగుబడిని అందించే విధంగా తమకు నచ్చిన వరిపంటను సాగుచేయడంతో తమ పంటలను కాపాడుకోవడంతో పాటు వాటికి గిట్టుబాటు ధర కల్పించాలని పలువురు రైతులు కోరుతున్నారు. అయితే గత వారం రోజులుగా వాతావరణంలో మబ్బులు కమ్ముకోవడంతో పాటు, పంటలకు రకరకాల రోగాలు పడుతున్న సందర్బంగా వ్యవసాయ అధికారులు పంటపొలాల బాట పట్టి పంటలను రక్షించేందుకు వివిధ క్రిమిసంహరక మందులను వాడాలని చూపిస్తున్న తరుణంలో రైతుల బోర్ల నుండి నీరు పోయకపోవడంతో వాటర్‌ ట్యాంకుల ద్వారా వరిపంటను కాపాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాలల్లో రాత్రిపూట పంటకు నీరు పెట్టుందుకు వెళ్లిన రైతులు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి.
రబీలో ప్రకృతి కరుణించకపోవడంతో.. యాసంగిలో నైనా కట్టెకుత్తామని రైతులు తమకున్న వ్యవసాయ పొలంలో వరిపంటను సాగు చేశారు. యాసంగిలో మొదటగా మంజీర, పసుపులేరు నుండి నీరు రావడంతో ఆనందం వ్యక్తం చేసిన రైతులు తమకున్న భూమి అంతా సాగు చేసుకొని నాట్లు చేశారు. ఈ సమయంలో నీరు అడపదడపగా వరికి అందడంతో ఇబ్బందులు పడుతూ వ్యవసాయ బోరుబావుల నుండి కొంతమేర నీరు పారపెట్టినప్పటికీ బోర్లలో నీరు తగ్గిపోవడంతో, భూగర్భజలాలు అడుగంటడంతో కొంతమంది రైతులు తమ పంటలను కాపాడుకోవడం కోసం వాటర్‌ ట్యాంకులతో నీరు అందిస్తున్నారు.
గిట్టుబాటు ధర అందేనా..
గత రబీ సీజన్‌లో రైతులు ప్రభుత్వం గిట్టుబాటు ధర విషయంలో సన్నరకం, దొడ్డురకం పేరుతో కొనుగోలు చేసినప్పటికీ డబ్బులు సమయానికి రాకపోవడంతో దళారులను ఆశ్రయించిన రైతులు ఈ సారైన తమ పంటకు ముందుగా మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. చేతికి వచ్చిన వరిపంటను కాపాడుకోవడంతో పాటు పంట కోసం చేసిన అప్పులు తీర్చడం కోసం ఎంతో కష్టపడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడిదారులు తయారు చేసిన వస్తువును మార్కెట్‌లో విక్రయించడానికి ముందే వారు ఈ ధరకు మాత్రమే అమ్మడం జరుగుతుందని ప్రకటిస్తూంటారు. అయితే రైతులు మాత్రం పండించిన పంటను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన తరువాత అక్కడి అధికారులు, లేదా దళారులు తమకు నచ్చిన ధర పెట్టడంతో రైతులు ఆరుగాలం పండించిన పంటను అప్పుల పూర్తికి రాకపోవడంతో దిగులు చెందకపోవడంతో పాటు ఇంత వస్తే అంతకే అమ్ముకొని అప్పులు చెల్లించుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాలోనే ధాన్యం విక్రయించాలి..
– రైతు నాగరాజు పాపన్నపేట మండలం గాంధారిపల్లి.
తెలంగాణ ప్రభుత్వం రైతుల పంటను కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం విక్రయించి తమకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, కొనుగోలు చేసిన 24 గంటలలోపే డబ్బులను రైతు ఖాతాలో జమ చేయాలని పాపన్నపేట మండలం గాంధారిపల్లి రైతు నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు.
చేతికొచ్చే పంటకు నీరందక ఇబ్బందులు..
– రైతు కైరోద్దీన్‌ చిత్రియాల పాపన్నపేట మండలం.
చేతికొచ్చే వరిపంటకు నీరందకపోవడంతో ఎంతో పంటకు వివిధ రకాల క్రిమిసంహాంకర మందులు పిచికారి చేయడం జరిగిందని, బోరుబావులో నీరు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి కనీస మద్దతు ధర ఇప్పించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ రైతు కైరోద్దీన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement