Friday, February 3, 2023

మైత్రి మైదానాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాం : ఎమ్మెల్యే జీఎంఆర్‌

మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప‌టాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ 33వ సంవత్సరమైన ఈరోజు టోర్నమెంట్ ను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అన్ని రకాల క్రీడలు నిర్వహించేందుకు మైత్రి మైదానాన్ని అన్ని హంగులతో కోట్ల రూపాయలు వెచ్చించి తీర్చిదిద్దామన్నారు. 33వ మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజునుండి ఈనెల 26 వరకు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్ అన్ని జట్టుల సభ్యులను కలిసి గెలుపే లక్ష్యంగా ఆడాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సప్పన్నదేవ్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు పి హనుమంత్ రెడ్డి, డి.ఎస్.పి భీమ్ రెడ్డి, సీఐ వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు అఫ్జల్, మాజీ మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు ఎల్లయ్య , సెక్రెటరీ రవీందర్ గిరి, నరసింహ, శ్రీనివాస్, నందకిషోర్, రాజు, పాపారావు, సుమన్ లాల్, రాము, అశోక్, మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement