Thursday, May 2, 2024

‘శుద్ధిపేట’గా కొనసాగిద్దాం : మంత్రి హరీష్ రావు

సిద్దిపేట : సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని, ఇకపై శుద్ధిపేటగానే కొనసాగిద్దామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇంటింటా నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్తలో పొడి చెత్త రీ సైక్లింగ్ చేస్తున్నామని తెలిపారు. నిత్యం 10 నుంచి 15 టన్నుల తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తున్నట్లు, 15 నుంచి 20 టన్నుల తడి వ్యర్థాలతో సేంద్రియ జీవ ఎరువు తయారు చేస్తున్నట్లు వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకూ 2,522 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 756 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ సీఎన్జీ గ్యాస్ తయారైందని, అలాగే 579 టన్నుల తడిచెత్తతో సేంద్రియ జీవ ఎరువు తయారైందని మంత్రి చెప్పారు. దీంతో బుస్సాపూర్ డంప్ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకుప్పలు తొలగిపోయాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement