Monday, April 29, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

రాష్ట్ర మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడని తెలిపారు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా ఎన్నికై 1971 వరకు కొనసాగాడన్నారు. నిఖార్సయిన తెలంగాణ వాది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement