Monday, May 6, 2024

తెల్లాపూర్ దీక్షలకు జగ్గారెడ్డి మద్దతు

రామచంద్రాపురం : తెల్లాపూర్ దీక్షలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి పాల్గొని నిరసన కారులకు మద్ద‌తు తెలిపి వారికి అండగా ఉంటానని తెలిపారు. పఠాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తెల్లాపూర్ తో పాటు ఉన్న ఉస్మాన్ సాగర్, కొల్లూరు, నాగులపల్లి, వెల్మల ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కోసం గ్రామానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న మూడు చెరువులను శుభ్రం చేసే విధంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలని, కొల్లూరులో కడుతున్న డబుల్ బెడ్ రూమ్స్ లో 30% స్థానిక పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement