Friday, May 17, 2024

వర్షాలు పడాలని కప్పతల్లి ఆటలు

జూన్ మొదటి వారంలో పడాల్సిన వర్షాలు పడకపోవడంతో “వర్షాలు కురవాలి వానదేవుడో పంటలు బాగా పండాలి వానదేవుడో” అంటూ పాటలు పాడుతూ కప్పతల్లి ఆటలు ఆడిన సంఘటన మెదక్ జిల్లాలో గ్రామంలో చోటు చేసుకుంది. వర్షాలు కురవాలని పెద్ద మనుషులే కాదు చిన్నారులు సైతం మేమున్నామంటూ ముందుకొచ్చారు. చిన్నారులు అంతా కలిసి రోకలి పట్టుకుని వాడ వాడ తిరుగుతూ వర్షాలు కురవాలని కప్ప తల్లిపై నీళ్ళు పోస్తూ వరుణ దేవుణ్ణి వేడుకున్నారు. వర్షాలు కురవాలని ఇల్లిల్లూ తిరుగుతూ కప్పతల్లి ఆట ఆడుతూ పాటలు పాడారు.. భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా మహిళలు చిన్నారులపై బిందెలతో నీళ్ళు పోశారు. ఇందులో మరో చిత్రమేమిటంటే వీరంతా ముస్లిం చిన్నారులు కావడం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement