Friday, May 3, 2024

ఉడిపి హోటల్లో అగ్నిప్రమాదం

పటాన్ చెరు : పటాన్‌చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ కూడలి వద్ద ఉన్న ఉడిపి హోటల్‌లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవ‌రికి ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం, స్థానికులు సమీపంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సకాలంలో అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. హోటల్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా నిత్యం రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఒక్కసారిగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో వాహనదారులు చుట్టుపక్కన ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అగ్నిప్రమాదంలో హోటల్ ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగి ఉండవచ్చునని హోటల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement