Saturday, April 20, 2024

రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్

(వెంకటాపూర్) : ప్రపంచ 40వ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత మొదటిసారిగా ఈ కార్యక్రమం సోమవారం మండలంలోని పాలంపేటలో గల రామప్ప ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్, స్థానిక ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వి.ప్రకాష్ మాట్లాడుతూ… చారిత్రక కట్టడం రామప్ప అని, యునెస్కో గుర్తించడం సంతోషకరమ‌ని చెప్పారు. రామప్ప మట్టి తల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందని, నీటిలో తేలియాడే మట్టి పెల్లెలతో రామప్ప ఆలయ నిర్మాణంలో ఓ భాగమ‌ని గుర్తు చేశారు. కాకతీయ హెరిటేజ్ నిర్వాహకులు ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ… వి.ప్రకాష్ భూములు కూడా కొంత మేరకు రామప్ప ఆలయ నిర్మాణం లో భాగంగా విరాళాలుగా ఇచ్చారన్నారు. వి.ప్రకాష్ సేవలు అభినందనీయమ‌ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోశాల వ్యవస్థాపకులు వీరమల్ల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రామ్మోహన్, సెంట్రల్ ఆర్కియాలజీ అధికారులు, పాలంపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement